Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ కథానాయకుడు పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ?

Category : movies

ఎన్టీఆర్ కథానాయకుడు నందమూరి కుటుంబం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం.ఎన్టీఆర్ కథానాయకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం అశేష ప్రజల ఆదరణ పొందుతోంది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది అని స్పందనను జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తెలియజేయలేదు. దీంతో అభిమానులంతా జూనియర్ ఏం చెప్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూసారా లేదా? చూస్తే ఇప్పుడు వరకు ఎందుకు కామెంట్ చేయలేదు? సినిమాలో బాలయ్య యాక్షన్ పట్ల జూనియర్ అభిప్రాయమేంటి? తెలుసుకోవాలని చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. కానీ ఇప్పటివరకు జూనియర్ మాట్లాడకపోవటంతో అందరూ ఒకింత నిరాశ లోనే ఉన్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ఎన్టీఆర్ గా బాలకృష్ణ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇక ఖర్చుకు వెనుకాడకుండా అందరూ స్టార్లను పెట్టి తీసిన ఈ సినిమా మొదటి పార్ట్ నిన్న రిలీజ్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల మనస్సును ఎన్టీఆర్ కథానాయకుడు గెలుచుకుంది. చాలా గొప్పగా సినిమా ఉందని అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకులు ఎన్టీఆర్ కు జయజయధ్వానాలు పలుకుతున్నారు. బాలకృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించి తన స్టైల్ ను పక్కన పెట్టి ఎన్టీఆర్ గా జీవించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు.తొలిరోజే భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఈ చిత్రం నందమూరి నట జీవితానికి, కుటుంబంతో ఆయనకున్న అనుబంధానికి అద్దం పడుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ లో గతంలో ఎన్నడూ చూడని ఒక కోణం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఎవరికి వారే పోటాపోటీగా దీటుగా నటించారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ అందరినీ ఆకట్టుకుంది.

ఇక సినిమాలో అందరు తమ తమ పాత్రలకు నిజ రూపం కల్పించారంటే నమ్మాలి. ఇప్పటికే చాలామంది సినీ పరిశ్రమ వర్గాలు ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. క్రిష్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కథను న్యారేట్ చేసే విధానం చూసిన చాలామంది ఇండస్ట్రీ వారు ఇది క్రిష్ కే సాధ్యమంటూ మెచ్చుకున్నారు . ఇక ఎందరో దర్శకులు కూడా ఎన్.టి.ఆర్ కథానాయకుడి మీద తమ స్పందన తెలియచేశారు. నవరస నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను చాలా అద్భుతంగా నిర్మించిన బాలకృష్ణ ను, ఈ చిత్ర నిర్మాణం కోసం దర్శకుడిగా పెద్ద సాహసం చేసిన క్రిష్ ను అభినందించారు.

ఇక ఈ సినిమాపై ఎవరెవరో ప్రశంసల జల్లు కురిపిస్తున్నాతాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. చాలా అద్భుతంగా పాత జీవితాన్ని, తన తండ్రికి తాతతో వున్న అనుబంధాన్ని తెరకెక్కించినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా పై ఎలాంటి కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్.టి.ఆర్ గారికి ఇది బెస్ట్ ట్రిబ్యూట్ అంటూ బాలకృష్ణ నటనపై కూడా మహేష్ తన స్పందన తెలియచేశాడు. ఎవరెన్ని చెప్పినా నందమూరి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమా పై తన స్పందన తెలియజేస్తే ఆ కిక్కే వేరు. ఇక ఈ సినిమాపై ఎన్.టి.ఆర్ రెస్పాన్స్ కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. నిన్న రిలీజైన ఈ సినిమాపై తారక్ ఎలాంటి కామెంట్ పెట్టలేదు. ఇప్పటికైనా రెస్పాండ్ అవుతాడేమో ని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఏ మాట్లాడుతాడు.. బాలయ్య నటనపై ఏమంటాడు... బాబాయ్ బాలకృష్ణ ను పొగుడుతాడా లేదా అని రకరకాల ఆలోచనల్లో నందమూరి అభిమానులు ఉన్నారు.అభిమానుల కోసమైనా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాకపోతే మళ్లీ నందమూరి కుటుంబం పై రకరకాల వార్తలు హల్ చల్ చేస్తాయి. ఇక ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి అయినా జూనియర్ ఇకనైనా స్పందించ వయ్యా బాబు.

Related News