//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటు హక్కు ఉపయోగించుకున్న ఎన్టీఆర్ .... అక్క పై షాకింగ్ కామెంట్స్ ...!

Category : politics

తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు . ఈ రోజు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేసేందుకు క్యూలైన్ లలో నిల్చొని తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు . ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు సామాన్య ప్రజానీకం తో పాటుగా ,ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు .

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు . అలాగే మరికొందరు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్నారు . కాగా ఈ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఎంతో కీలక మైన కూకట్ పల్లి నుండినందమూరి వారసురాలు , హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని మహాకూటమి తరపున ఎన్నికల బరిలో నిలిచింది .

కాగా దీనిపై ఎన్టీఆర్ స్పందించాడు . కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్‌‌లోని ఓబుల్ రెడ్డి స్కూలులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లి, భార్య ప్రణతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. క్యూలైన్‌లో అడిగిన వారికి సెల్ఫీలిస్తూ తారక్ ఓటుహక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది .తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే కంప్లైంట్ చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే. అక్క గెలవాలని మాత్రం కోరుకుంటున్నా అని చెప్పారు .

Related News