//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇట్స్ రియ‌ల్ న్యూస్‌.. ఎన్టీఆర్‌కు మళ్లీ బుడ్డోడు పుట్టాడు..!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడని.. తార‌క్‌కి అమ్మాయి పుట్టింద‌ని కొద్దిరోజుల క్రిత్రం సోష‌ల్ మీడియాలో వార్త‌లు ట్రాల్ అయ్యాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తారక్ ఖండించాడు. అయ‌తే తాజా మ్యాట‌ర్ ఏంటంటే ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. అవును ఈసారి మాత్రం నిజ‌మే.. తారక్, ప్రణతి దంపతులకు పండండి మ‌గ‌బిడ్డ పుట్టాడు.

ఇక ఇప్పటికే వీరికి అభయ్ రామ్ పేరుతో 4 ఏళ్ళ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోవారసుడు నందమూరి కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొద్దీ సేపటి క్రితం ప్రణతి పండంటి బాబుకు జన్మనిచ్చిందని స‌మాచారం. ఈ సందర్భాంగా ఎన్టీఆర్ త‌న సోషల్ మీడియాలో తనకి బాబు పుట్టాడు అనే విషయాన్ని తన అభిమానులకు చేరవేసాడు. The family grows bigger. It’s a BOY! (కుటుంబం పెద్దది అయ్యింది…) అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి మరో చిత్రంలో నటించబోతున్నారు.