తిత్లీ’ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సాయం చేసి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. తుపాను బాధితుల కోసం తారక్ రూ.15లక్షలు, కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి. గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్, కల్యాణ్ రామ్ వారికి సాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో తారక్ రూ.25 లక్షలు ఇవ్వగా కల్యాణ్‌రామ్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.Jr NTR and Kalyanram donate Money for Titli victims
‘తిత్లీ’ బాధితులకు యువకథానాయకుడు విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సాయం చేశారు. విజయ్ రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు. అనిల్ లక్ష రూపాయలు సీఎం నిధికి అందించారు. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ‘తిత్లీ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ రెండు జిల్లాల్లోని దాదాపు పన్నెండు మండలాల్లో ‘తిత్లీ’ తీవ్ర నష్టం కలిగించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. 2014లో వచ్చిన హుద్‌హుద్ కంటే తిత్లీ తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కువగా ప్రాణనష్టం జరగలేదు.Jr NTR and Kalyanram donate Money for Titli victims