Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గత టీడీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్....టీడీపీ అవినీతి పై న్యాయ విచారణ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Category : politics

గత ప్రభుత్వ పాలనపై దృష్టి సారించారు వైసీపీ నేతలు...గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలపై ఎక్కు పెడతామని....అవినీతి జరిగిందని తెలిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు...ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.టీడీపీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన ఏ ప్రాజెక్టును తమ ప్రభుత్వానికి అడ్డుకునే ఉద్దేశం లేదని..... వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ ప్రాజెక్టులోనూ భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఈ సందర్బంగా ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే తమకు అధికారాన్ని అప్పగించారని ఆయన స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సచివాలయానికి చేరుకున్న జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వై.ఎస్ జగన్ నాయకత్వానికి పట్టం కట్టారని ఆయన వ్యాఖ్యానిస్తునే.... గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న రీతిలో టీడీపీ నేతల వ్యవహారశైలి ఉందని ఆయన చెప్పుకొచ్చారు . టీడీపీ పాలనలో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం పూర్తి విచారణ జరిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ది చాలా నిర్మలమైన మనసు అనీ, అందుకే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం లేదని చెప్పారు.టీడీపీ నేతలు దోచుకున్న వేలకోట్ల ప్రజల సొమ్మును బయటకు తీస్తామని. వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతుందని అన్నారు. కోడెలపై తమకు ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. ప్రజలను కోడెల హింసించారు కాబట్టే ఆయన బాగోతాన్ని ప్రజలు బయటపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.