//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో మరో బంపర్ ఆఫర్

Category : business

టెలికం సంస్థ జియో మరో ఆఫర్ ప్రకటించింది. పోర్టబుల్ 4జీ రూటర్ ‘జియోఫై’ పై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించింది. నిజానికి దీని అసలు ధర రూ.1999 కాగా, గతేడాది సెప్టెంబరులో ధరను రూ.999కి తగ్గించింది. ఇప్పుడీ ధరపై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించడంతో రూ.499కే జియోఫై డాంగిల్‌ను సొంతం చేసుకునే అద్భుత అవకాశం లభించింది.

ఇప్పటికే జియోఫై రూటర్‌ను ఉపయోగిస్తున్నవారు ఈ ఆఫర్‌కు అనర్హులు. కొత్త వినియోగదారులకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని జియో పేర్కొంది. ఆఫర్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. అయితే, ఎప్పటి వరకు ఇది అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జియో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ‘జియోఫై’ని కొనుగోలు చేసుకోవచ్చు.

ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు కొత్త జియో ఫై రూటర్‌తోపాటు కొత్త పోస్టు పెయిడ్ సిమ్ కార్డును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.199 విలువైన ప్లాన్‌తో 12 నెలలు ఉపయోగించుకున్న తర్వాత రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాతి నెల బిల్లుల్లో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. రూ.199 ప్లాన్‌లో 25 జీబీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.