Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో సంచలనానికి జియో సిద్ధం........!

Category : national business

ఈ నెల 20న సాయంత్రం 5:01 గంటలకి ప్రారంభం కానున్న జియోఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫ‌ర్‌లో భాగంగా వినియోగ‌దారులు ఏదైనా వారి పాత ఫీచ‌ర్ ఫోన్ (ఏ బ్రాండ్ అయినా సరే) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ (ప్ర‌స్తుతం ఉన్న మోడ‌ల్‌)ను కేవ‌లం రూ.501 ప్రారంభ రుసుము చెల్లించి పొంద‌వ‌చ్చు.

ఇప్పటికీ మనదేశంలో 500మిలియ‌న్ల‌కు పైగా ప్ర‌జ‌లకి ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేదు. ఈ నేప‌థ్యంలో భార‌త‌దేశంలోని ప్ర‌తి జిల్లాలలో, తాలుకాలో, గ్రామ పంచాయ‌తీల‌లో, గ్రామాల‌లో జియో డిజిట‌ల్ లైఫ్‌ను ఆస్వాదించాలని జియో సంస్థ సామాజిక మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది.

జియోఫోన్‌లోని యాప్ ఎకోసిస్ట‌మ్‌తో విశేష‌మైన విష‌య‌ ప‌రిజ్ఞానం, కొత్త అంశాలు తెలుసుకోవడంతో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్‌ను త‌మ చేతివేళ్లతో స్పృశిస్తూ తెలుసుకోవ‌చ్చు. అలాగే ఫేస్‌బుక్‌, వాట్సాప్, యూట్యూబ్‌ సేవ‌ల‌ను కొత్త జియోఫోన్ లో పొందవచ్చు.

Related News