//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Category : national

జియో 4g మొబైల్స్ గురించి అందరికి తెలిసిన విషయమే.అతితక్కువ ధరకే 4g మొబైల్ ను అందుబాటులోకి తెచ్చి అందరిని ఆకట్టుకుంది.ఇప్పటిదాక జియో స్టోర్ లో షాప్స్ లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్,ఇప్పుడు అమెజాన్ లో కూడా అందుబాటు లోకి వస్తుంది.వివరాలలోకి వెళ్తే,

రూ.1500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని అమెజాన్ పేర్కొంది.జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను గతేడాది జూలై 21న రిలయన్స్ ప్రకటించింది. మొత్తం 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 2.4 అంగుళా డిస్‌ప్లే, 2 ఎంపీ రియర్ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, మైక్రో ఎస్టీ కార్డు సౌలభ్యం తదితరాలు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. రూ. 153 నెలవారీ రీచార్జ్ ప్యాక్‌‌తో వచ్చిన ఈ ఫోన్ కోసం గత నెలలో జియో రూ.49తో అత్యంత చవకైన ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌తో యూజర్లు అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్‌ కోసం అభివృద్ధి చేసిన ఫేస్‌బుక్ యాప్‌ను ఈనెల 14న విడుదల చేసింది. ఫలితంగా జియో ఫోన్లలోనూ ఫేస్‌బుక్‌ను చూసుకునే అవకాశం దక్కింది