//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో మరో బంపర్ ఆఫర్ .....

Category : business

హైదారాబాద్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 41వ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేష్ అంబానీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆఫర్లే కాదు జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లింపు విషయంలో కూడా ఒక రికార్డు స్థాయిని బ్రేక్ చేసిందని కొనియాడారు అంబానీ.కేవలం 22నెలల్లో 215మిలియన్లు మంది వినియోగదారులకు సేవలందిస్తున్న ఘనత జియోకు దక్కిందన్నారు.

ప్రపంచంలోనే అన్ని నేటివర్కులలో అతి తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల మందిని సంపాదించిన రికార్డ్ జియోదేనన్నారు. జియో వినియోగదారులు రోజులో సగటున 219నిమిషాల పాటు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు.లాభాల బాటలోనే కాదు నమ్మకాల బాటలో కూడా జియో ముందుండటంతో ఇంకా కొత్త ఆఫర్లను ఇచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు అంబానీ.

బ్రాడ్‌బ్యాండ్ సేవల వినియోగంలో భారత్ చెప్పుకోదగ్గ స్థితిలో లేదని, అందుకే ఇప్పటికే 250మిలియన్ డాలర్లను బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. 1100నగరాల్లో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో తెస్తున్నట్లు వెల్లడించారు.బ్రాడ్ బ్యాండ్ కోసం జియో గిగా ఫైబర్ పేరుతో సేవలందించడానికి ముందుంటామని చెప్పారు.ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ జియో ఫోన్2ను ఆవిష్కరించారు. ఫుల్ కీ ప్యాడ్‌తో కూడిన ఈ ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌తో పాటు పలు ముఖ్యమైన యాప్స్‌ను వినియోగించుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపారు.తక్కువ ధరతో ఎక్కువ లాభాలు పొందేలా ఉండేలా 2999 రూపాయలు మాత్రంగా చెప్పారు.

పాత జియో ఫోన్‌లో కూడా ఆగస్ట్ 15నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ యాప్స్ అందుబాటులోకి రానున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇవే కాకుండా ఈ సందర్భంగా జియో టీవీ.. గా సెట్ టాప్ బాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.రిలయన్స్ జియో పాత ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించారు.4కె రిజల్యూషన్‌తో.. వాయిస్ కమాండ్ ఆధారంగా కూడా పనిచేసే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.501 రూపాయలతో పాటుగా పాత ఫోన్ లేచి కొత్త ఫోన్ తీసుకోవచ్చని అంబానీ అనర్గళంగా మీడియా సమావేశంలో చెప్పారు.ఏది చరిత్రలో తాను ఇలా ఎప్పటికి మరువలేని సేవలు ప్రజలకిస్తానని కూడా చెప్పారు.