వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారత్ కి చెందిన రెజ్లర్ జిందర్ మహల్ రికార్డు సృష్టించాడు. హెవీవెయిట్ చాంపియన్‌షిప్ గెలిచి ఆశ్చర్యపరిచాడు. బ్యాక్లాష్ ఈవెంట్లో భాగంగా జరిగిన ఈ టైటిల్ ఫైట్‌లో స్టార్ రెజ్లర్ రాండీ ఆర్టాన్పై జిందర్ గెలిచాడు. 2007లో ద గ్రేట్ ఖలీ తర్వాత ఈ చాంపియన్‌షిప్ గెలిచిన ఇండియన్‌గా జిందర్ నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈకి జిందర్ 50వ చాంపియన్. అతని విజయంతో అక్కడున్న ఇండియన్ కామెంటేటర్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇండియా నంబర్ వన్ అంటూ అరిచారు. కెనడాలో ఉండే జిందర్.. డబ్ల్యూడబ్ల్యూఈలో మాత్రం ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ విక్టరీతో మహరాజ్ యుగం మొదలైందని గెలిచిన తర్వాత జిందర్ చెప్పాడు.