//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Category : world

యుద్ధానికి రెడీ ఉండమని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మట్టిస్‌ తమ బలగాన్ని హెచ్చరించారు.

గత కొంతకాలంగా రష్యా, చైనా నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన సైన్యాన్ని ఆదేశించారు. కొత్త రక్షణ వ్యూహాన్ని సిద్ధం చేయాలని పెంటగాన్‌ భావిస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఈమధ్య అమెరికా సైనిక సామర్థ్యంలో మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇప్పటికీ మన సైన్యం బలంగానే ఉంది. గగన తలంలో, ఉపరితలంలో, అంతరిక్షంలో, సైబర్‌ స్పేస్‌లో మన మెరుగ్గా ఉన్నప్పటికీ అది నానాటికీ కొంత తగ్గుతూ వస్తుందని తెలిపారు.

అందుకు సరైన బడ్జెట్‌ కేటాయింపులు వాటికి సరిగ్గా జరగడం లేదని దాంతో అమెరికా సైన్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని డోనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అందుకనే మరోసారి మొత్తం సైనిక శక్తిని పటిష్టం చేసి పునరుత్తేజం నిపాల్సిన అవసరం ఉంది’ అని జిమ్‌ మట్టిస్‌ వివరించారు.