సల్మాన్ ఖాన్ తనకు ఫోన్ చేసి, బిగ్ బాస్ షోలో పాల్గొమ్మని చెబితే తాను పాల్గొంటానని ఫెమినా మిస్ ఇండియా 2013 జోయా అఫ్రోజ్ తెలిపింది.
ముంబైలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, తాను సల్మాన్ ఖాన్ తో కలిసి నటించానని జోయా అఫ్రోజ్ తెలిపింది. సల్మాన్ అంత మంచి వ్యక్తిని ఈ భూప్రపంచంలో తాను చూడలేదని ఆకాశానికెత్తింది. ఆయన ఫోన్ చేసి అడిగితే కాదనలేనని తెలిపింది. ఆయన స్వయంగా ఫోన్ చేస్తే బిగ్ బాస్ లో పాల్గొనేందుకు సిద్ధమని చెప్పింది.
కాగా, జోయా సల్మాన్ నటించిన 'హమ్ సాత్ సాత్ హై' సినిమాలో బాలనటిగా నటించింది. ఈమధ్యే బాలీవుడ్ లో విడుదలైన 'స్వీటీ వెడ్స్ ఎన్ఆర్ఐ' సినిమాలో కూడా నటించింది.