//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"అర్జున్ రెడ్డి" తమిళ్ రీమేక్ "వర్మ" లో హీరోయిన్ గా .....జాన్వీ కపూర్

Category : movies

తాజాగా తెలుగు "అర్జున్ రెడ్డి" తమిళ్ రీమేక్ "వర్మ" సినిమా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ రీ షూట్ కి వెళుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సైరాట్ రీమేక్ ధడక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఈ తమిళ్ రీమేక్ వర్మ సినిమాలో నటించనుందని ముఖ్య సమాచారం.

తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి. ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ వర్మ పేరుతో రూపొందుతున్న రీమేక్‌ని చిత్ర బృందం రద్దు చేసింది. దర్శకుడు బాలకు, చిత్ర బృందానికి మధ్య అభిప్రాయ బేధాల కారణంగా ఈ చిత్రాన్ని రద్దు చేస్తున్నామని ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు పేర్కొనడం జరిగింది.

ఈ సినిమాను మరో దర్శకుడితో మళ్లీ కొత్తగా నిర్మిస్తామని చిత్ర నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో షాలిని పాండే పోషించిన పాత్రలో జాన్వీ కపూర్, జియా శర్మ పాత్రలో మేఘా చౌదరి నటించనున్నట్లు తమిళ చిత్ర వర్గాల సమాచారం. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వుందని, ఇప్పటికే హీరో విక్రమ్ ఆయనను సంప్రదించారని, గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమా విషయంలో పాజిటివ్ గా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Related News