//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు.

Category : national

ఇంటర్ తర్వాత దేశంలోనే అత్యంత ప్రముఖ పరీక్ష జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఫలితాలను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా సుమారు 12లక్షల మంది రాయగా అందులో 1.60లక్షల మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌లో పాసైన విద్యార్థులు మే 21న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది. ఈ నెల 28 నుంచి జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.ఏప్రిల్‌ 2(ఆఫ్‌లైన్‌), 8, 9(ఆన్‌లైన్‌) లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే.