//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గవర్నర్ కు లేఖ రాసిన జేడీ(ఎస్) అధినేత...!

Category : politics

కర్ణాటక లో రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు జేడీ( ఎస్) కాంగ్రెస్ తో కలిసి నడవడానికి ముందుకు వచ్చింది. జేడీ (ఎస్) నేత కుమారస్వామి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు.

ఇవాళ సాయంత్రం 5.30 నుంచి 6గంటల మధ్యలో కలిసే అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ మద్దతును తాము అంగీకరిస్తున్నామని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కుమారస్వామి గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరి మద్దతు కూడా తమకే ఉందని ఇప్పటికే కుమారస్వామి ప్రకటించారు.