//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబుకి జేసి ఏం చెప్పారు

Category : politics

తన మనసులో ఉన్న మాటను ఏ మాత్రం దాచుకోకుండా చెప్పే తత్వం అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి ది. ఈ క్రమంలోనే ఆయనకు అనేక విమర్శలు కూడా వస్తు ఉంటాయి. అయితే తాజాగా ఆయన చంద్రబాబుకి తన మనసులో ఏమనుకుంటున్నారో నిర్మొహమాటంగా చెప్పెసారట. అదేమిటో ఒక్కసారి చూద్దాం..ఢిల్లీలో ఎంపీల పోరాటం అనంతరం అందరు ఎంపీలు తిరిగి సొంత నియోజకవర్గాలకు వచ్చేశారు. కాని జేసి దివాకర్ రెడ్డి మాత్రం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వచ్చేశారు.

ఈ క్రమంలో ఆయన కొన్ని అభిప్రాయాలను చంద్రబాబు ముందు ఉంచారట.. అదే జగన్ పవన్ కలిసి పోటి చేసేది.. అదేమిటో ఒక్కసారి చూద్దాం. పవన్‌కల్యాణ్‌.. జగన్మోహన్‌రెడ్డిలను కలిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ఇద్దరిని కలిపి ఎన్నికలలో పోటీ చేయిస్తే టీడీపీ ఓడిపోతుందనేది నరేంద్రమోదీ వ్యూహం కావచ్చని అన్నారు. జగన్‌, పవన్‌లు చెరో సగం సీట్లకు పోటీ చేసే అవకాశం ఉందని.. ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని చూస్తున్నారని జేసీ వివరించారు.

అయితే ఈ ప్రతిపాదనకు జగన్మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని కొంతమంది టీడీపీ నేతల దగ్గర జేసీ వ్యాఖ్యానించారు. ఒకవేళ అది కాకపోతే సీట్ల వారిగా వారితో పొత్తు పెట్టించి... జగన్ కి ముఖ్యమంత్రి వదిలేసి మిగిలిన మంత్రి పదవులను పవన్ కళ్యాణ్ పార్టీకి ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే మోడికి ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని నివేదికలు వెళ్లాయని కూడా ఆయన ప్రస్తావించారట... ఆ నివేదికల్లో మోడిపై చంద్రబాబు పోరాటం ప్రారంభించిన నాటి నుంచి ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిందని కూడా ఢిల్లీ వద్ద ఒక నివేదిక ఉందట.

Related News