//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వై. ఎస్ జగన్ కి ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ లేదని ఇది కుల పిచ్చి కి పరాకాష్ట అని..... జేసీ దివాకర్ ఘాటు వ్యాఖ్యలు.

Category : state politics

రెండు రోజుల క్రితం ఏపీ లో జరిగిన ఎన్నికల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన వైఖరి పై ఇప్పటికే టీడీపి పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు నుంచి ఆ పార్టీ నేతల ఇండ్ల పై జరిగిన ఐటీ దాడులు, ఉన్నతాధికారుల బదిలీలు, ఈవిఏం మిషిన్ల యెక్క పని తీరు పై నిరసన వ్యక్తం చేస్తూ....

ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో సహా దాదాపు 15 మంది మంత్రులు, ఎమ్మెల్యే లు కలిసి ఢిల్లీ లోని కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన విషయం విదితమే..ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ....అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కులపిచ్చి పరాకాష్టకు చేరిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఆ విషయంలో భాగంగా నే వైసీపీ అధినేత జగన్ కు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేక పోయినా ప్రజలకు కల్లి బొల్లి కబుర్లు చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీ పార్టీనే గెలుస్తుందనీ, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు. మహిళల ఆదరణ చంద్ర బాబు నాయుడు గారికి పుష్కలంగా ఉండడం వల్లే టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు.అలాగే జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలి తో పాటు ఈవీఎంల సమస్యను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము ఢిల్లీకి వచ్చామని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో నల్లధనం, అవినీతిని నిరోధించాలని ఈసీని కోరామని. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ క్వీన్ స్వీప్ చేస్తుందన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.

Related News