//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జేసీ సంచలన నిర్ణయం....రాజకీయాలకి గుడ్ బై...!

Category : politics

రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోచించిన వారిలో జేసీ దివాకర్‌రెడ్డి ఒకరు. ఈయనను అందరూ ముక్కుసూటి మనిషి, నిర్మొహమాటంగా ఉంటారు అని అంటారు. ఇదే అయన ఆయన ప్రత్యేకత. స్వపక్షంలోనే విపక్ష పాత్ర వహిస్తూ సొంత పార్టీకే ముచ్చమటలు పట్టించడం ఆయనకే సాధ్యం.

కాంగ్రెస్‌, టీడీపీ రెండు పార్టీల్లోనూ ఆయన చురుకైన పాత్ర వహించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా, ఎంపీగా అనేక పదువులను అలంకరించారు. ఆ పదువులకు వన్నెతెచ్చారు. అంతేకాదు అనంతపురం రాజకీయాలను కనుసైగతో శాసించారు.

జేసీ తన రాజకీయ ప్రస్థానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్తానని వెల్లడించారు.

ఆయన వారసుడిగా పవన్‌రెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పవన్‌రెడ్డి జెట్‌ స్పీడుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఆయన అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని నాయకులతో చర్చిస్తూ స్థానికంగా సహకారం కోరుతున్నారు.

Related News