//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాసేపట్లో మహాసమాధి కానున్న జయేంద్ర సరస్వతి..!

Category : national

మరికాసేపట్లో జయేంద్ర సరస్వతి మహాసమాధి కానున్నారు. జయేంద్ర సరస్వతి పార్థివదేహానికి వేదపండితులు మహాభిషేకం నిర్వహిస్తున్నారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధి చేయనున్నారు. స్వామిని కడసారి దర్శనం కోసం భారీగా భక్తులు మఠానికి తరలివస్తున్నారు.

కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు పరమపదించారు. రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చిన ఆయన, అంతలోనే అస్వస్థతకు గురయ్యారు. బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు.

సేవకులు స్వామీజీని సమీపంలోని ఏబీసీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు స్వస్థత చేకూర్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. గుండెపోటుతో ఆయన ఉదయం 9 గంటలకు మరణం చెందినట్టు మఠం నిర్వాహకులు ప్రకటించారు.స్వామిజి ని చూడడానికి చెన్నై,కర్ణాటక నుండి భక్తులు వస్తున్నారు. స్వామి కి మహాభిషేకం నిర్వహిస్తున్నారు.వేదం మంత్రాల మధ్య బృందావనం మహా ప్రవేశ అభిషేకం నిర్వహిస్తున్నారు.