మన జీవితానికి సంబంధిన కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి, లేకుంటే అవి మన జీవితంలో ఒక మచ్చలా మిగిలిపోతుంటాయి అంటూ సూపర్ స్టార్ రజినీ కాంత్ కి సలహాలిస్తోంది సీనియర్ నటి, రాజకీయ నేత జయప్రద. రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ సీనియర్ నాయకురాలుగా ఆమె సూపర్ స్టార్ కి ఓ సలహా ఇస్తోందట.
రజినీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తే పక్కాగా విజయం సాధిస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవిలా మాత్రం పార్టీ పెట్టి.. మళ్లీ వెనకడుగు వేయకూడదన్న అభిలాషను ఆమె వ్యక్తం చేశారు. పార్టీ పెట్టడం చాలా తేలికైన విషయం అని ..కానీ దానిని కొనసాగిస్తూ, పార్టీని అధికారంలోకి తీసుకురావటమే పెద్ద విషయం అని ఆమె అన్నారు.
రజనీ రాజకీయాల్లోకి రావటానికి ఇదే సరైన సమయం అన్న ఆమె.. ఎంత ఎత్తుకు ఎదిగినా సామాన్యుడిలా వ్యవహరించే రజనీ వ్యక్తిత్వాన్ని ఆమె పొగిడేశారు.