//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్... అపోలోలో జ‌య చికిత్స వీడియోలు లీక్‌

Category : national

త‌మిళ‌నాడులో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయం చిత్ర‌విచిత్రంగా ట‌ర్న్ అవుతోంది. తాజాగా ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక టైం ద‌గ్గ‌ర ప‌డుతోన్న వేళ క‌ల‌క‌లం రేగే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

అపోలో ఆసుప‌త్రిలో జ‌య చికిత్స జ‌రుగుతున్న‌ప్పుడు ఆమెను ఎవ్వ‌రూ క‌ల‌వ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన టీటీవీ దినకరన్‌ మద్దతుదారుడు పీ వెట్రివేల్‌ ఈ వీడియోను విడుదల చేశారు. ఇక జ‌య చికిత్స పొందుతోన్న వీడియోను తాము చాలా రోజుల క్రింద‌టే రిలీజ్ చేయాల‌నుకున్నా అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ వీడియో ఇప్పుడు విడుద‌ల చేసిన‌ట్టు వెట్రివేల్ చెప్పారు.

ఇక జ‌య మృతిపై ఏర్పాటైన క‌మిష‌న్ నుంచి త‌మ‌కు స‌మ‌న్లు అందాక‌, ఆధారాల‌ను తాము క‌మిష‌న్ ముందు ఉంచుతామ‌న్నారు. ఇక ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ల‌బ్ధి పొందేందుకే దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఇప్పుడు జ‌య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న వీడియోలు రిలీజ్ చేసింద‌ని ఇత‌ర పార్టీల‌ నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.