Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫస్ట్ లుక్ తోనే క్యాంపెయినింగ్ షురూ చేసిన జయలలిత

Category : movies

ఈ మధ్య కాలం లో బయోపిక్ ల హంగామా బాగా పెరిగిపోయింది. మేరీకోమ్ చిత్రం తో ఒక్కసారిగా బయోపిక్ చిత్రాలు వరస కాట్టాయి. ఒక్క హిందీ లోనే కాదు. తెలుగు కూడా ఎన్టీఆర్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు , కె సి ఆర్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాంతరావు , దాసరి నారాయణ రావు , అక్కినేని నాగేశ్వర రావు బియోపిక్స్ కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు మన దర్శక నిర్మాతలు.

తాజాగా తమిళ్ నట జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది. జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ను ప్రకటించాడు ప్రియదర్శన్. జయలలిత పాత్ర కోసం మొదట త్రిష , నయనతార లను సంప్రదించారు కానీ వాళ్ళు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తదేమోనని ఒప్పుకోలేదు. తరువాత నిత్య మీనన్ అయితే బాగుంటుందని ఆ పాత్ర ఆమె ను ఎంపిక చేసారు ప్రియదర్శన్.

ఈ సినిమా పై అంచనాలు బాగున్నాయి. ప్రియదర్శన్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై తమిళ్ తో పాటు మలయాళం లో అంచనాలు నెలకొన్నాయి. ప్రియదర్శన్ తెలుగు లో కూడా నాగార్జున తో నిర్ణయం సినిమా ను తెరకెక్కించాడు. తాజాగా ఈ బయోపిక్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. నిత్య మీనన్ ప్రతిభ కలిగిన నటి అనే విషయం అందరికి తెలిసిందే.

ఆమె స్కిన్ టోన్ .. గ్లామర్ .. హైట్ ఇవన్నీ కూడా జయలలితకు కాస్త దగ్గరగా ఉండటం వలన, ఈ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనుకున్నారు. 'ది ఐరన్ లేడీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి, తాజాగా నిత్యామీనన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా వచ్చి ఏడాది విడుదల కానుంది.

Related News