//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌న‌సేన ప‌రిస్థితి ప్ర‌జారాజ్యం క‌న్నా అతి ఘోరం.. పాపం ప‌వ‌న్‌..!

Category : politics

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, టాలీవుడ్‌లో ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఎక్క‌డ సినిమా ఈవెంట్ జ‌రిగినా, ఆ సినిమా ఈవెంట్ ప‌వ‌న్‌కు సంబంధించింది కాక‌పోయినా.. ప‌వ‌న్ అన్న పేరు చెబితే చాలు ప‌వ‌నిజం అంటూ ఈళ‌లు, కేక‌లు. ఇటువంటి అభిమానం కేవ‌లం ప‌వ‌న్‌కే సొంతం. అయితే, ఇదంతా గ‌త‌మ‌ని అంటున్నారు సినీ, రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అంత సీన్ లేదా..? ఆయ‌న క్రేజ్ మ‌రీ అంత‌లా త‌గ్గిందా..? దానికి కార‌ణం ఏమిటి..? సినిమా, రాజ‌కీయాల్లో ఇక‌పై ప‌వ‌న్ రాణించ‌డం క‌ష్ట‌మేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

ఇక అస‌లు విష‌యానికొస్తే, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన పేరుతో పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌ట్నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యాడు కూడా.

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో ఉన్న స‌మ‌యంలో సేవా కార్య‌క్ర‌మాలను విస్తృతంగా నిర్వ‌హించిన ఆయ‌న అభిమానులు.. జ‌న‌సేన పార్టీ స్థాప‌న త‌రువాత సేవా కార్య‌క్ర‌మాల ప‌రిధిని పెంచారు. ఒక వైపు జ‌న‌సేన పార్టీ గుర్తు.. మ‌రో వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోల‌తో వీధి.. వీధినా టెంట్లు వేసి మ‌రీ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అయితే, అలా జ‌న‌సేన నుంచి ఎటువంటి ఆర్థిక సాయం ఆశించ‌కుండానే సేవా కార్య‌క్ర‌మాలు విస్తృతంగా చేస్తున్న త‌మ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తించి పార్టీలో ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా..? అన్న ఆశ కూడా వారిలో మ‌రింత ఉత్సాహాన్ని రేపింది.

ఇప్పుడు ఆ ఆశే జ‌న‌సేన పార్టీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంప ముంచింది. అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌ను గుర్తించ‌క‌పోతాడా..? ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతాడా..? అని అనుకున్న వారంతా ఇప్పుడు నిరాశ నిస్పృహ‌ల‌కు గుర‌వుతున్నారు. అందుకు కార‌ణం, అప్ప‌టి వ‌ర‌కు సేవా కార్య్ర‌మాల్లో నిత్యం పాల్గొంటూ.. జ‌న‌సేన జెండాను మోసి, పార్టీ క‌టౌట్లు క‌ట్టిన వారికి కాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త‌వారికి కండువాక‌ప్పి ప్రాధాన్య‌త‌తోపాటు.. ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డ‌మే.

దీంతో అప్ప‌టి వ‌ర‌కు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన వారంతా ఇప్పుడు జ‌న‌సేన పార్టీకి గుడ్‌బై చెప్పి ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ అంశ‌మే ప‌వ‌న్‌ను ఆయ‌న అభిమానులు వీడే ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌వ‌ర్త‌న ఇలానే గ‌నుక కొన‌సాగితే, ప్ర‌జారాజ్యం పార్టీక‌న్నా.. అతి ఘోరంగా జ‌న‌సేన ఓట‌మిపాల‌వుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Related News