//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు.. జ‌న సైనికులు బిగ్ షాక్‌..!

Category : politics

రాష్ట్రంలో రాజ‌కీయాలు ఫాలో అయ్యే వారికి ఒక్క విష‌యం క్లియ‌ర్ క‌ట్‌గా తెలుస్తుంది. ఏపీలో ఇద్ద‌రు ప్ర‌తిప‌క్ష నేత‌లు ఉన్నారు. వారిద్ద‌రి మ‌ధ్య ఎన్నిక‌ల నాటికి అవ‌గాహ‌న ఖాయ‌మ‌ని ఏపీ వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. ఉమ్మ‌డి ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌తీసేందుకు వీరు ఒక్క‌టైపోతార‌న్న న‌మ్మ‌కం గ‌ట్టిగానే ప్ర‌జ‌ల్లో నాటుకుపోయింది. వైకాపా, జ‌న‌సేన చేతులు క‌ల‌పొచ్చు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌కు వైఎస్ జ‌గ‌న్ అడ్డంకిగా మారే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని వైసీపీ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌కు బ్రేక్ రావ‌డానికి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డేన‌ని చెబుతున్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాన్ చేస్తున్న బ‌స్సు యాత్రకు కొద్ది రోజులుగా విరామం ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ అనుచ‌రుల్లో ఎక్కువ‌మంది ముస్లింలు కావ‌డంతో రంజాన్ పండుగ‌ను దృష్టిలో ఉంచుకుని విరామం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. రంజాన్ త‌రువాత యాత్ర‌ను విశాఖ‌లో ప్రారంభించ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు.

అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవ‌డం దానికి రంజాన్ ప‌ర్వ‌దినాన్ని కార‌ణంగా చూప‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. దీని వెనుక పెద్ద ర‌హ‌స్య‌మే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ముమ్మ‌రంగా ఏర్పాట్టు జ‌రుగుతున్నాయ‌ని, అందుకే జ‌న‌సేన యాత్ర‌కు బ్రేక్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సేన శ్రేణులు మాత్రం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ కోసం మ‌నం త‌ప్పుకోవ‌డం ఏమిటి..? అంత ఖ‌ర్మ మ‌న‌కేం ప‌ట్టింది అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద మండిప‌డుతున్నారు జ‌న‌సేన అభిమానులు.

Related News