//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన చైర్మెన్ చిరంజీవా...!

Category : politics

జనసేన పార్టీ ఆవిర్భావం జరిగాక మెగాస్టార్ తొలిసారి జనసేన పార్టీ పై స్పందించారు. జనసేన లో మెగాస్టార్ అభిమానుల చేరికతో రాష్ట్రము లో పార్టీ బలం మరింత పెరిగిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు.

ఈ వ్యవహారం అంట చూస్తుంటే మెగాస్టార్ డైరెక్షన్ లోనే జనసేన ముందుకు కదులుతుందా అనే డౌట్ అందరిలోనూ వస్తుంది. ఇప్పుడు వున్న పరిస్థితి చూస్తుంటే చిరంజీవే ముందుండి ప్రజాపోరాట యాత్రని విజయవంతం చేస్తున్నాడని తెలుస్తుంది. 2009 లో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ దిగిన నేపథ్యం లో అయన పార్టీ ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోలేక ఓటమిని చూడాల్సి వచ్చింది . తరువాత అయన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసారు.

తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చాడు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనే ప్రత్యక్షం గా బరిలోకి దిగుతున్న కారణం గా పవన్ కళ్యాణ్,అలాగే నాగబాబు ఇద్దరు కలిసి మళ్ళీ చిరంజీవిని జనసేన పార్టీ తరపున పోటీచేయాలని అడుగుతున్నారని సమాచారం. అలాగే వచ్చే కాలంలో మెగాస్టార్ జనసేన ని ముందుకు తీసుకుపోయేలా తన ఇద్దరు తమ్ముళ్లు ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు

Related News