Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కలకలం రేపుతున్న జనసేన లో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

Category : state politics

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ప్రాధాన పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన కచ్చితంగా 15 స్థానాలు దక్కించుకుంటుంది అన్న రిపోర్ట్ తో అవసరం అయితే పవన్ స్నేహ హస్తం అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇక అన్ని పార్టీలు అభ్యర్థుల కసరత్తులో ఉంటె జనసేన లో మాత్రం ముగ్గురు అభ్యర్థుల ప్రకటన పవన్ కు కూడా తెలీకుండానే జరిగిపోయింది . అదెలా అంటే ఈ స్టోరీలోకి ఓ లుక్కెయ్యండి.

ఒక పక్క ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనకు కసరత్తులు చేస్తుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నట్టు లేదు. అభ్యర్తులప్రకటన అంశం ఆయన మాట్లాడటం లేదు. ఇక వ్యక్తిగతంగా 10 వేల ఓట్లు వస్తే చాలు పార్టీ నుండి టికెట్ ఇస్తామని సంకేతాలిచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఎవరో ఘనులు పవన్ సంతకం ఫోర్జరీ చేసి జనసేన లెటర్ హెడ్ మీద ముగ్గురి పేర్లను అభ్యర్థులుగా ప్రకటిస్తూ దానిని వైరల్ చేశారు. ఇంకేం అదే నిజమని జనసైన్యం కూడా నమ్మారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా జనసేన లాంటి పార్టీ కే ఇలాంటి సమస్య వచ్చి పడింది. సోషల్ మీడియా లో జనసైన్యం చాలా చురుగ్గా పని చేస్తుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులను జనసేన లెటర్ హెడ్ మీద పవన్ సంతకం ఫోర్జరీ చేసి మరీ బయటకు వదిలారు. ఇక బహిరంగ చర్చలకంటే సోషల్ మీడియా ద్వారానే పార్టీ అధ్యక్షుడు పవన్ కార్యకర్తలు, అభిమానులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. కాబట్టి అది ఆయన పంపిన సందేశమే అనుకుంటారని భావించినట్టు ఉన్నారు . అభిమానులు సైతం సోషల్ మీడియాను వినియోగించుకునే పార్టీ ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అదంతా నిజంగా జనసేన చేసిందని భావిస్తారని ఫీలై అందుకే ప్రత్యర్థులు కొందరు అదే సోషల్ మీడియా వేదికగా పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆ ప్రయత్నాలో భాగంగానే జనసేన జనసేన పార్టీ లెటర్ ప్యాడ్ పై పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ అభ్యర్థులు ఖరారైనట్టు ప్రచారం మొదలుపెట్టారు. అందులో విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా కొంగటి సత్యం, తూర్పు శాసన సభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసన సభ అభ్యర్థిగా కొరడా విజయ కుమార్ ను పార్టీ నియమించినట్టు ఉంది. ఇక మొదట ఈ ప్రెస్ నోట్ చూసి జనసేన శ్రేణులు కన్ఫ్యూజ్ అయ్యాయి. ఇక అది నిజమని దాదాపు నమ్మేశాయి. సోషల్ మీడియాలో చర్చలు కూడ మొదలుపెట్టాయి. కానీ దీన్నీ తొందరగానే పసిగట్టిన పార్టీ సోషల్ మీడియా విభాగం అది నిజమైంది కాదని, అభ్యర్థులను అధ్యక్షుడు మాత్రమే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారని క్లారిటీ ఇవ్వటం తో ఇది ఫేక్ లెటర్ అని తేలింది. మొత్తానికి జనసేనాని అవసరం లేకుండానే ముగ్గురు అభ్యర్థులు ఫేక్ లెటర్ పుణ్యమాని ఏపీలో వైరల్ అయ్యాయి.