Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు మెలిక ... ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి రాజీనామా

Category : state politics

చంద్రబాబు పెట్టిన మెలికతో రామ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగాలనుకున్న రామ సుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్ల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించిన చంద్రబాబు టికెట్ విషయంలో మెలిక పెట్టారు. ఇక ఈ మెలిక నేపథ్యంలోనే రామ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ పంచాయితీ సుఖాంతమైంది. వచ్చే ఎన్నికల్లో రామసుబారెడ్డి పోటీ చేస్తారని జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఎమ్మెల్యే సీటు కన్ఫామ్ కావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు రామసుబ్బారెడ్డి. తన రాజీనామా లేఖను సీఎంకు ఇచ్చారు. దీంతో కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నారు. అలాగే ఆదినారాయణరెడ్డి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్టు సమాచారం.

ఇదిలావుంటే ఇద్దరిలో ఎవరైతే కడప ఎంపీగా పోటీ చేస్తారో వాళ్లకే ప్రత్మామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎంపీగా పోటీ చేస్తారని, ఎమ్మెల్సీ పదవి వద్దు అనుకున్న వారు జమ్మలమడుగు నుంచి ఎమ్మల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందని వారికి చెప్పారు సీఎం చంద్రబాబు.దీంతో ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు.

Related News