Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంపీగా ఆది నారాయణరెడ్డి ... ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి ... జమ్మలమడుగు టికెట్ ఫైనల్

Category : state politics

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే ఎక్కడా లేని సమస్యలా మారిన జమ్మలమడుగు పంచాయతీ ఒక కొలిక్కి వచ్చింది. ఇరు నేతలకు ఎవరికి ఏ టికెట్ ఇస్తారని దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికే చంద్రబాబు దశలవారీగా ఎన్నోసార్లు చర్చలు జరిపి, వారిరువురు తీరు మారక అసహనం వ్యక్తం చేసి చివరకు ఇద్దరు నేతలను ఒప్పించి ఒకరిని ఎంపీగా, మరొకరిని ఎమ్మెల్యేగా ఎన్నికల రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు.

జమ్మలమడుగు ఎక్కడా లేని ఇబ్బంది టిడిపికి ఆ సెగ్మెంట్ లో ఉండేది. ఎక్కడా లేని మొండితనం కూడా అక్కడ నాయకులకు వుంది. పూర్తిగా ఫ్యాక్షన్ నేపధ్యం ఉండటమే అందుకు కారణం .ఫ్యాక్షన్ రాజకీయాలకు మారు పేరైన కడపలో జమ్మల మడుగు నియోజక వర్గంలో టీడీపీ కి నిన్నటి వరకు పెద్ద తలనొప్పి వుంది. కానీ అనూహ్యంగా ఇరువురు నేతలు తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు సంతోషాన్ని కలిగించింది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమే ఎవరిని ఎమ్మెల్యే గా బరిలోకి దిగిన, ఎవరిని ఎంపీగా పోటీ చేయమన్న తాము సిద్ధమంటూ మంత్రి ఆది నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబుకు చెప్పిన విషయం విధితమే.

అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వారిరువురికి టిక్కెట్ల కేటాయింపుపై తన లెక్కలను వివరించి మరి టికెట్లను కేటాయించారు. ఎంపీ బరిలో ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బరిలో రామ సుబ్బారెడ్డి ని దించడానికి చంద్రబాబు నిర్ణయించారు. అయితే కడప జిల్లాలో అత్యంత కీలకమైన జమ్మలమడుగు టికెట్ వ్యవహారంలో కూడా హేమాహేమీలు గా పార్టీ లో ఉన్నటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ల వివాదం పరిష్కరించి వారిలో ఒకరికి ఎంపీగా, మరొకరికి ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పిన నేతలు తర్వాత చంద్రబాబు చెప్పిన లెక్కలు చూసి ఎవరికి ఏ స్థానం నుంచి టికెట్ కేటాయించిన ఓకే అని చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగు నుండి అసెంబ్లీ స్థానానికి రామ సుబ్బారెడ్డి ని బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అలాగే మంత్రి ఆది నారాయణ రెడ్డి కి ఐదు నియోజకవర్గాల్లో పట్టు ఉన్న నేపథ్యంలో ఆయనను ఎంపీ గా బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక దీని కోసం ఆయన తాను సర్వే చేయించిన రిపోర్టు గురించి ఇరువురు నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా కడప లోకసభ స్థానాన్ని గెలుచుకుంటే అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయడం సులువవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు కడప ఎంపీ గెల్చుకునే అవకాశం ఉన్న లెక్కను ఇద్దరి నాయకులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. కడప లోక్‌సభ స్థానాన్నీ కైవసం చేస్కోవాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసిన వైసీపీ సైతం తాజా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స్థానంలో, ఇంకా బలమైన నేతను , వైయస్ కుటుంబం నుండి రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ సతీమణి భారతిని పార్లమెంటు స్థానంలో నిలపపోతున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. మరి చూడాలి కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి, జమలమడుగు ఎమ్మెల్యే గా రామసుబ్బారెడ్డి రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో...