//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాష్ట్ర ప్రజలందరి చూపు ఆ నియోజక వర్గం వైపే...!

Category : politics

2019 సార్వత్రిక ఎన్నికలకి సమయం దగ్గర పడుతుండడం తో ఏపీ లోని అన్ని ప్రధాన పార్టీలు తమ కార్యాచరణని సిద్ధం చేసుకొని వ్యూహాత్మకంగా రంగం లోకి దిగుతున్నాయి . అధికార పార్టీ అయిన టీడీపీ అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పంథాలో పరుగులు పెట్టింస్తుంది . మరో వైపు జగన్ పోయిన ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడా తో అధికారాన్ని కోల్పోగా ఈ సారి ఎలాగైనా అధికారమే పరమావధిగా చేసుకొని ఎన్నికల వ్యూహంతో ప్రజాసంకల్ప యాత్ర అంటూ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ ముందుకు కదులుతున్నాడు.

ఇక పొతే రాష్ట్రం లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కూడా ఆ నియోజక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది . ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో మరోసారి అందరి చూపు ఆ నియోజక వర్గం వైపే ఉంది . ఇంతకీ ఆ నియోజక వర్గం ఏమిటంటే కడప జిల్లాలోని జమ్మలమడుగు . ఇక్కడినుండి ప్రస్తుతం రాష్ట్ర మంత్రి అయిన అది నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు .

ఈ జమ్మలమడుగు నియోజక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం లభించటానికి గల కారణం , ఫ్యాక్షన్ కి పెట్టింది పేరుగా ఉన్న కడప జిల్లాలో మరి ముఖ్యంగా ముఠా కక్షలు ఇక్కడే ఎక్కువగా ఉండేవి అప్పటినుండి ఇప్పటివరకు జమ్మలమడుగు నుండి ఎందరో ఉద్దండులైన నాయకులూ వచ్చారు . దీనితో మరోసారి ఎన్నికలు సమీపిస్తుండడం తో అందరి చూపు ఆ నియోజక వర్గం ఫై పడింది . వైసీపీ కి కంచుకోట లాంటి కడప జిల్లాలో టీడీపీ జెండా జమ్మలమడుగులో ఎగురవేస్తానని మంత్రి సవాల్ చేసిన ఈ సమయం లో జమ్మలమడుగులో టీడీపీ విజయానికి ఆదినారాయణ రెడ్డి ఏమి చేయబోతున్నాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు . మరికొన్ని రోజులు ఆగితేతప్ప మంత్రి గారి ఆలోచన ఏమిటో తెలిసేలా లేదు ....