//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జై సింహ మూవీ రివ్యూ

Category : movies

నటీ నటులు : బాలకృష్ణ , నయనతార తదితరులు

మ్యూజిక్ : చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ : రాం ప్రసాద్

నిర్మాణం : సి.కే. ఎంటర్టైన్ మెంట్స్

నిర్మాత : సి.కళ్యాణ్

కథ- స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : కె.ఎస్.రవి కుమార్

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 102వ చిత్రం ‘జైసింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార.. నటాషాదోషి.. హరి ప్రియ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది.

బాలకృష్ణ నయనతార పెయిర్ కి, అలాగే బాలయ్య కి సంక్రాంతి సెంటిమెంట్ ఉందని మనందరికీ తెలిసిందే, ఇప్పుడు జై సింహా తో మరిసారి అదే పెయిర్ సంక్రాంతికి కి మన ముందుకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం జై సింహా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం ! తనకు కలిసొచ్చిన సంక్రాంతి పండగ సీజన్‌లో ‘జైసింహా’గా బాలయ్య ఎలాంటి మేజిక్‌ చేశాడంటే ఈ రివ్యూ చూడాల్సిందే.

కథ

నరసింహ (బాలకృష్ణ) తన కొడుకుని పెంచుకుంటూ జీవిస్తుంటాడు. బాలకృష్ణ కు తన కొడుకు అంటే అమితమైన ప్రేమ, ఈ ప్రేమ కారణంగానే ఉండే కాలనీ లో గొడవలు అయ్యినా మరేదైనా సమస్య ఉన్నా బాలకృష్ణ వివాదాలు లేకుండా ఉండే చోటుకు వెళ్లిపోతు ఉండేవాడు. ఒకసారి అలానే మారాల్సి వచ్చి కుంభకోణం కు వెళ్తాడు.

అక్కడ తెలుగు వాళ్ళు అంటే స్వతహాగా ఇష్టపడే మరో తెలుగు వాడు అయ్యిన మురళి మోహన్ కు బాలకృష్ణ పరిచయం అవ్వడం తో బాలకృష్ణ ను తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన దగ్గర డ్రైవర్ ఉద్యోగం ఇస్తాడు. మురళి మోహన్ కూతురు నటాషా దోషి. విదేశాల నుండి తిరిగి వచ్చి ఇక్కడ డ్రగ్స్ మందుకు అలవాటయి ఉంటుంది. అలానే ఒకరోజు తాగేసి కాలకేయ ప్రభాకర్ తమ్ముడిని గుద్దుతుంది.

కాలకేయ ప్రభాకర్ కు తన తమ్ముడు అంటే విపరీతం అయ్యిన ఇష్టం. అయితే అతను ఏమి చేస్తాడో అని ఆక్సిడెంట్ చేసింది బాలకృష్ణ అని చెప్పి నమ్మిస్తారు. అది తెలుసుకున్న ప్రభాకర్ తన తమ్ముడుకి ఏమైనా అయితే చంపేస్తా అనడం తో నటాషా దోషి చేసిన యాక్సిడెంట్‌ నేరాన్ని నరసింహ తనపై వేసుకుంటాడు, ఈ కేసు లో అరెస్ట్ చేసి జైలు కి తీసుకెళ్తుండగా నరసింహ తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసారని వారితో గొడవకి దిగి ఆ బిడ్డ ని కాపాడతాడు.

గతంలో ఒకసారి హోమ్ మినిస్టర్ తో గొడవ పడి ACPకి శత్రువు గా మారతాడు. బాలకృష్ణకు ACP తో గొడవలు ఉండటం కక్ష కట్టిన ACP ప్రభాకర్ తమ్ముడిని చంపేస్తాడు. ఇదే సమయంలో గౌరి తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అప్పుడు నరసింహా కుంభకోణంలోని పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు. నరసింహకు గౌరికీ, సంబంధం ఏంటి? తెరపై చూడాల్సిందే. నరసింహ వారి బిడ్డ ని తన బిడ్డ అని ఎందుకు అనుకుంటాడు ? నరసింహ హింస కి ఎందుకు దూరంగా ఉంటాడు అనేది తెర మీద చూడాల్సిందే !

విశ్లేషణ

బాలయ్య బాబు ఎప్పటి లానే చాలా కష్ట పడ్డాడు . డైలాగ్స్ చెప్పడం లో., మంచి డాన్స్ లు చేయడం లో., సెంటిమెంట్ పండించడంలో తన ప్రతిభను కనబరిచాడు. కాకుంటే పస లేని కథ , దిశా గమనం లేని కధనం బాలకృష్ణకి కాస్త ఉసూరుమనిపించినా పండగ రేసులో హిట్ సినిమా గా నిలిచింది.

నయనతార కళ్ళు తిప్పుకోలేనంత బావుంది. ప్రియం జగమే ఆనందమయం పాట లో ఆమెని చూడడానికి రెండు కళ్ళు చాలవు. బరువైన ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. కానీ చాల సేపు ఆమె పాత్ర ఏడుస్తూనే వుంది . హరి ప్రియా బాల కృష్ణ భార్యగా కొద్దీ సేపు అమాయకమైన పాత్ర లో కనిపించింది. నటాషా అమ్మకుట్టి పాట మాత్రం నభూతో న భవిష్యత్ అని చెప్పాలి.

ప్రకాష్ రాజ్, నయనతార తండ్రి పాత్ర లో కొద్ది సేపు మెరిశాడు. బ్రహ్మానందం మరియు మిగతా కమెడియన్స్ కాసేపు పాత తరహా కామెడీతో విసుగు పుట్టించారు. చిరంతన్ భట్ నేపధ్య సంగీతం అలరించింది. ముఖ్యం గా అమ్మ కుట్టి మరియు ప్రియం పాటల సమయంలో ఎవరైనా సీటులో కూర్చుంటే ఒట్టు. విశేషం ఏంటి అంటే గత సినిమా కన్నా బాలకృష్ణ ఈ సినిమాలో మరింత యంగ్ గా మాన్లీ గా కనపడతాడు.

ప్లస్

బాలకృష్ణ

అమ్మకుట్టి సాంగ్‌

బాలయ్య డ్యాన్సులు

బ్రాహ్మణుల గురించి చెప్పే సన్నివేశం

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌
బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు

నయనతార

హరిప్రియ

కథలోని ట్విస్ట్ లు,

యాక్షన్ సన్నివేశాలు,

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,

సినిమాటోగ్రఫి.

మైనస్

ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడి అనవసరం అనిపిస్తుంది,

మొదట్లో కాస్త స్లో గా సాగినా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ చివరికి ఊపు అందుకుంటుంది.

సెకండ్ హాఫ్

ఓల్డ్ స్టొరీ ఓల్డ్

కామెడీ

మ్యూజిక్

INS MEDIA రేటింగ్ : 4 / 5

By Bhargav Chaganti