//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జై లవకుశ కి దక్కిన అరుదైన గౌరవం...!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో చాలానే గొప్ప సినిమాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగిన జాబితాలో ఎన్టీఆర్ మూడు పాత్రలతో తన విశ్వరూపాన్ని చూపిన జై లవ కుశ ముందుగా కనిపిస్తుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టింది.

అలాంటి ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది. నార్త్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను జై లవ కుశ సినిమాను ఎంపిక చేశారు.ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో జై లవ కుశ కి ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా జై లవ కుశ కావడం విశేషం.

ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం .. మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించడం. పాత్రల్లోని వైవిధ్యం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ హైలైట్స్ ఈ సినిమాకి ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.