//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయనాయకుడిగా జగపతిబాబు.....!

Category : movies

జగపతి బాబు తెలుగులో హీరోగ ఎంత సక్సెస్ ఐయ్యారో అందరికి తెలిసిన విషయమే.ఇటీవల తండ్రి పాత్రలు,ప్రతినాయకుడి పాత్రలతో అందరిని అక్కటుకుంటున్న విషయం అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు తాజాగా జగ్గు మరో పాత్రలో మన అందరిని ఆక్కటుకుంటానికి సిద్ధమైయ్యారు.వివరాలలోకి వెళ్తే,

పవర్ ఫుల్ పాత్రలో కూడా తన సత్తా చాటుకున్న జగ్గు ఇప్పుడు మరో పవర్ ఫుల్ పాత్రలో మనముందికి వస్తున్నాడు.జగపతిబాబు తాజాగా 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.ఈ సినిమాలో బలమైన ఓ రాజకీయనాయకుడిగా జగపతిబాబు కనిపిస్తాడట.

ఇంతవరకూ జగపతిబాబు చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. నువ్వా? నేనా? అన్నట్టుగా రవితేజ .. జగపతిబాబు తలపడే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆయన పాత్రను కల్యాణ్ కృష్ణ అద్భుతంగా తీర్చిదిద్దాడని అంటున్నారు.ఈ సినిమాలో రవితేజ జోడీగా మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.