//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ రావాలి......జగన్ కావాలి ...!

Category : politics

ఏపీ లో రాజకీయంగా ఇప్పుడు కీలక సమయం అని చెప్పవచ్చు . ఎన్నికలు మరో నాలుగు లేదా ఐదు నెలల కాలం లోనే ఉండవచ్చు అన్న సంకేతాలతో ప్రధాన పార్టీలని కూడా ఎన్నికలు సిద్దమౌతున్నాయి . కీలక భేటీ ల తో ఏపీ ఇప్పుడు వేడెక్కుతుంది .

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర లో భాగంగా విశాఖ పట్నం లో పాదయాత్ర లో చాలా బిజీ గా ఉన్నాడు . ఈ తరుణం లో ఎన్నికల వేడి ఎక్కువ కావటం జగన్ కీలక సమావేశం నిర్వహించారు . ఏపీ లో మరో 4 నెలల్లో ఎన్నికలు ఉంటాయని చెప్తున్నా ఈ తరుణం లో జగన్ కీలక భేటీ అందరిని అటువైపు చూసేలా చేస్తుంది .

ఈ భేటీలో వైసీపీ పార్టీ నుండి కీలక నేతలు పాల్గొన్నట్టు సమాచారం . ఈ సమావేశం లో నేతలకి , సమన్వయ కార్యకర్తలకి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసారు . ఈ నెల 17 నుండి రాష్ట్రం అంతటా జగన్ రావాలి ...జగన్ కావాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు వైసీపీ నేతలు . జగన్ ఈసారి అధికారమే పరమావధిగా పెట్టుకొని పాదయాత్ర చేస్తున్న జగన్ ఎన్నికలపై కూడా సరైన అవగాహనతో ఉన్నటు తెలుస్తుంది ,

Related News