//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న జగన్..!

Category : politics

ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో ఎన్నో హామీలు కురిపిస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్యే పాదయాత్ర నెల్లూరు జిల్లా లోకి ప్రవేశించింది.

అయితే జగన ఇప్పటి వరకు కురిపించిన హామీలు కంటే ఒక విభినమైన. ఆంధ్ర రాష్ట చరిత్ర కు సంభిందించిన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే నవంబరు 1వ తేదీనే ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఉండేలా చూస్తానని ఆయన అన్నారు.

భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి మూలకారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు సొంత జిల్లా నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ ఆ నేల మీదే ఈ మంచి నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న తిరుగులేని చరిత్రను, ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావంలో ఉన్న అపురూపమైన త్యాగాలను చారిత్రక దృక్కోణంలోంచి కాపాడడానికి వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నట్లు అయింది. ఏపీలోని చంద్రబాబు సర్కారు ప్రస్తుతం జూన్ 2వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

నిజానికి అది తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావ దినోత్సవమే తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఎలా అవుతుందనే ప్రశ్న చాలా మంది మేధావుల నుంచి వచ్చింది. అయితే వారి వాదనల్ని తుంగలో తొక్కేస్తూ చంద్రబాబు సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది.

జూన్ 2న రాష్ట్రం చీలిపోయిందనే ఆవేదనతో కూడిన గాయం రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆరిపోనివ్వకుండా దాన్ని అదేరోజున కెలుకుతూ ఉండడానికా అని పలవురిలో సందేహాలున్నాయి. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంగా ఏ ప్రాంతమైతే అవతరించిందో అదే ప్రాంతం ఇప్పుడు మళ్లీ తిరిగి పాత రాష్ట్రంలాగానే ఏర్పడిపోయింది.

Related News