Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వామ్మో.జగన్ ఆస్తి ఇన్ని కోట్లా ?

Category : politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఆసక్తికర అంశం తెలిసింది.అదేంటంటే ఏపీ కేబినెట్‌లో జగన్ అత్యంత సంపన్నుడు.ఈయన సంపద విలువ ఏకంగా 510 కోట్లు.అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.ఏపీ రాష్ట్ర కేబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులు.ఈ 26 మంది సంపద విలువ సగటున 35.25 కోట్లుగా ఉంది.వైఎస్ జగన్ తర్వాతి స్థానంలో పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు.

ఈయన సంపద విలువ 130 కోట్లు. పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.ఈయన సంపద విలువ 61 కోట్లు.ఇక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 20 కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు.మంత్రివర్గంలోని 26 మంది మంత్రుల్లో ముగ్గురి వార్షిక ఆదాయం కోటికి పైమాటే.ఇందులోనూ జగన్ మోహన్ రెడ్డి టాప్‌లోనే ఉన్నారు.ఈయన వార్షిక ఆదాయం మొత్తంగా 38 కోట్లు.ఇందులో ఈయన సొంత ఆదాయం 25 కోట్లు.శ్రీనివాస్ రావు వార్షిక ఆదాయం మొత్తంగా 3 కోట్లు.సొంత ఆదాయం కోటి.

విద్యా శాఖ మంత్రి వార్షిక ఆదాయం మొత్తంగా 1 కోటి.సొంత ఆదాయం 28 లక్షలు.జగన్ మంత్రివర్గంలో 8 మంది 8 నుంచి 12 వ తరగతి మధ్యలో చదువుకున్నారు.గ్రాడ్యూయేషన్ పూర్తి చేసినవారు 18 మంది ఉన్నారు. అలాగే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోని 35 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.2014 లోని మంత్రివర్గం కన్నా ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం.మంత్రివర్గంలోని 26 మందిలో 9 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Related News