//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలయ్య టార్గెట్ గా హిందూపురంలో జగన్ వ్యూహం .. బరిలో మైనార్టీ నేత

Category : politics state

ఏపీలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థుల ప్రకటన చేస్తుంటే వైసిపి టీడీపీ అభ్యర్థులు ను సమర్ధవంతంగా ఎదుర్కొని నాయకులను బరిలోకి దింపడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హీరో బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంపై గురి పెట్టారు. బీసీలతో పాటు మైనార్టీలకు గట్టి పట్టున్న ఈ ప్రాంతంలో టీడీపీని ఎదుర్కోనేందుకు రిటైర్ట్ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్‌ను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు హిందూపురంలో టాక్ వినిపిస్తోంది.

గతంలో మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని బాలయ్యపై ప్రయోగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఘనీ ఆరోగ్యం సరిగా లేకపోవడం, చురుగ్గా ఉండకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అబ్దుల్ ఘనీని రంగంలోకి దింపితే గెలిచే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇక్బాల్ అహ్మద్ పేరు తెర మీదకు వచ్చింది.

మరోవైపు హిందూపురంతో పాటు చిలమత్తూరు మండలాల్లో సైతం బలమైన మైనార్టీ కోసం వైసీపీ అన్వేషిస్తోంది. మైనార్టీ అయినప్పటికీ స్థానికంగా ఆర్ధిక, అంగబలం వున్న వ్యక్తి కావడంతో ఇక్బాల్ అహ్మద్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. గతంలో పోలీస్ అధికారిగా ఉన్న పరిచయాలు, హిందూ పురంలో ఆయనకున్న బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణాల నేపథ్యంలో బాలయ్య పై ఇక్బాల్ అహ్మద్ ను బరిలోకి దింపనున్నట్లు గా టాక్ వినిపిస్తోంది.