//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అలుపెరుగని ప్రజా బాటసారి.....!

Category : politics

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ, వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.

ఈ రోజు ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి 100వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు.నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోడానికి వందల మైళ్లు దాటి నడచివస్తుంటే జననేతకు పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతిస్తున్నాయి. మెండైన ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని ఆయన అడుగులు రాష్ట్ర చరిత్రను ప్రభావితం చేస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా మండుటెండను సైతం లెక్కచేయక ప్రజల కోసం జగన్‌ చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు.

జగన్‌ అడుగులో అడుగు వేసి జనం ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లలో తోడు ఉంటానంటూ జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారు. పాదయాత్రతో పాటు జగన్‌ సభలకు జనం పోటెత్తుతున్నారు. రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. అండగా తామున్నామంటూ రాజన్న బిడ్డపై జనం అభిమానాన్ని కురిపిస్తున్నారు. నువ్వే,మా ముఖ్యమంత్రివంటూ ఆశీర్వదిస్తున్నారు. జనం జగన్‌ ఒకరికొకరిగా ఈ యాత్ర సాగుతోంది. బుధవారం నాటికి యాత్ర నూరు రోజులకు చేరుకుంది. నూరు రోజుల సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గం మర్రిచెట్లపాలెం గ్రామంలోకి యాత్ర ప్రవేశించనుంది. అదే రోజు బూదవాడ, రామతీర్థం గ్రామాల గుండా యాత్ర సాగనుంది. సాయంత్రం చీమకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైఎస్‌.జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర వంద రోజుల పండుగను నియోజకవర్గంలో మరింత ఘనంగా నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్ని ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవాలి. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం దక్కేలా చూడాలి. ప్రతి పేద బిడ్డా గొప్పగా చదవి పెద్దవాడిగా ఎదగాలి. రైతన్నకు వ్యవసాయం పండుగ కావాలి. బడుగు బలహీన వర్గాల్లో బరోసా కల్పించాలి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోవాలి. ఇదే నా కసి అంటూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. గతేడాది నవంబర్ ‌6న ప్రారంభమైన జననేత సుదీర్ఘయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది.

చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నాకున్నది ఒక్కటే కసి, నేను చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి. ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి. ఆ కసి నాలో ఉంది కాబట్టి ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను తొలి రోజు పాదయత్రలో వైఎస్‌ జగన్‌ చెప్పారు.

నేను వేసే ప్రతి అడుగులో మీ అప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైఎస్సార్‌పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశ్వీరాదాలు నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి .

తొలి రోజు : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభం.

25వరోజు : కర్నూల్‌ జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం, మదనాంతపురంలో ప్రారంభం, చెరువు తొండలో ముగింపు.

50వ రోజు : చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎంనుంచి ప్రారంభం, జమ్మిలవారిపల్లిలో ముగింపు.

100వ రోజు : ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఉప్పలపాడులో ప్రారంభం.

ప్రజా సంకల్ప యాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ నుండి మొదటి రోజు ప్రారంభమయింది

తరువాత అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ను 500 కి మీ పూర్తీ చేసారు.

అలుపెరగని బాటసారిగా నిరంతరం గా జగన్ కొనసాగిస్తున్న పాదయాత్ర 1000 కి మీ పూర్తీ చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో 1000 కి మీ పూర్తీ సంధర్బం గా పైలాన్‌ ఆవిష్కరణ చేసారు.

ఇప్పటి వరకు ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరు జిల్లాలు, 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగించుకొని,అలుపెరుగక ముందుకు సాగుతున్నాడు.

Related News