//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్, కేవీపీ కలవకుండా అడ్డుపడుతున్న వైవీ సుబ్బారెడ్డి..!

Category : politics

వైఎస్ జగన్, కేవీపీ రామచంద్రరావు కలవకుండా తాను అడ్డుపడ్డానని జరుగుతున్న ప్రచారాన్ని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.

ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ కేవీపీ, జగన్ కు అండగా నిలువకుండా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన విషయం ప్రస్తావనకు వచ్చింది. మీకు కేవీపీకి మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదా అన్న ప్రశ్న ఎదురైంది.

ఇది తప్పు అటువంటిది ఏమీ లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా స్వాగతించడానికి సిద్ధం. ఆయనకుండే కొన్ని సమస్యల వల్ల రాలేకపోయారేమో. అందుకు కారణాలు ఆయన్నే అడగండి. నాకు తెలియదు అన్నారు. పార్టీకి షర్మిల, విజయమ్మ దూరంగా ఉన్నారన్న వార్తలపై స్పందిస్తూ, అటువంటిది కూడా ఏమీ లేదని, వారి అవసరం ఎప్పుడు వచ్చినా, సేవలు అందిస్తారని చెప్పారు.

పార్టీ గౌరవాధ్యక్షులుగా ఇప్పటికీ విజయమ్మ ఉన్నారని గుర్తు చేసిన వైవీ సుబ్బారెడ్డి, జగన్ అరెస్టయిన వేళ, షర్మిల బాధ్యతలు చేపట్టారని, తిరిగి ఆమె మళ్లీ ప్రచారానికి వస్తారని స్పష్టం చేశారు. జగన్ కు, షర్మిల మధ్య పొరపచ్చాలు ఉన్నాయన్న వార్తలు 'సుత్తి' అన్నారు. ఇటీవల ప్లీనరీకి కూడా ఆమె వచ్చారని గుర్తు చేశారు.