Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ క్యాబినెట్ లో తనకు ఇవ్వబోతున్న మంత్రి పదవి పై స్పందించిన ఎమ్మెల్యే రోజా

Category : politics

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా. మొదట ఆమే టీడీపీ పార్టీ ద్వారానే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం లభించినా ఓడిపోవడంతో ఆమె ను పై ఐరన్‌లెగ్ ముద్ర వేయడం జరిగింది.ఆమె ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదని ప్రచారం కూడా ఉంది. ఇదంతా 2014 ఎన్నికలకు ముందు మాట. కానీ ఇప్పుడు ఏపి రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు అన్ని ఆమెకు,ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ కి అనుకూలంగా ఉన్నాయి.అయితే తాజాగా ఇదే విషయం పై స్పందించిన వైసీపీ ఫైర్‌ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనది ఐరన్‌లెగ్ కాదని స్పష్టం చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనపై అలా దుష్ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు.ఈ సారి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం తో జగన్ క్యాబినెట్ లో ఆమెకు మంత్రి పదవి పక్కా అని తెలుస్తుంది.కాక పోతే ఆమెకి ఏ మంత్రి పదవి లభిస్తుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది .అయితే ఇదే పదవి అవకాశాలపైనా రోజా తాజా గా మాట్లాడుతూ. తనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని.. మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదని. పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో అది జగన్‌కు బాగా తెలుసని ఆమె తెలిపారు. కాగా, జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీ ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్‌ కూర్పు, ప్రజాకర్షక పథకాలు, పరిపాలనపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ తన కేబినెట్‌లోకి మొదట 25 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీసీ, ఎస్టీ, ఎస్సీలకు 50 శాతం వరకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు విడివిడిగా డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారని తెలిసింది. అలాగే... రెండున్నర ఏళ్ల తర్వాత కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారని తాజా సమాచారం.