//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పులివెందుల లో జగన్ కి షాక్ వైసిపి గండికోట లో ఎదురుదెబ్బ

Category : state politics

పులివెందుల పేరు చెబితేనే వై ఎస్ ఆర్ కుటుంబం గుర్తుకువస్తుంది …ఆ ఊరిని ఇంకా చెప్పాలి అంటే ఆ నియోజకవర్గాన్ని పెట్టనికోటగా చేసుకున్నాడు …దశాబ్దాలుగా అక్కడ అదే పరిస్థితి అక్కడ ఆ కుటుంబం ఆడిందే ఆట పాడిందే పాట

అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత మాత్రం ఆ కుటుంబానికి అక్కడ క్రమంగా పటు సడలుతూ వస్తుంది …ఇప్పటికి ఇప్పుడు అక్కడ వారికి పైకి పెద్దగా నష్టం కనిపించనప్పటికీ …పునాదులు మాత్రం కదలటం మొదలయ్యింది అనే చెప్పొచ్చు …దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్ వైఖరి మాత్రమే…ఒకప్పుడు వైఎస్ఆర్ బ్రతికి ఉన్న కాలంలో తాను రాష్ట్ర రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా తమ్ముడు వివేకానందరెడ్డి స్థానిక ప్రజానీకం తో రోజు వారీ అందుబాటులో ఉండి కుటుంబానికి ఉన్న పట్టు నిలబెట్టారు …అయితే ఆయన మరణం తర్వాత జగన్ కి ఆయన బాబాయ్ కి మధ్య వచ్చిన గ్యాప్ కావచ్చు …జగన్ సొంత కుటుంబ సభ్యులని సైతం నమ్మకపోవడం కావచ్చు …వైఎస్ఆర్ బ్రతికున్న కాలంలోనే జగన్ వైఖరితో అప్పట్లో బాబాయ్ వివేకా మనస్థాపానికి గురయిన విషయం తెలిసిందే

ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులు సతీష్ రెడ్డి , బిటెక్ రవి చేస్తున్న రాజీ లేని పోరాటం కూడా కొంత మేరకు సత్ఫలితాలే ఇస్తున్నాయి అని చెప్పక తప్పదు ….ఇప్పుడు తాజాగా ఎప్పటినుంచో ఆ కుటుంబానికి వెన్ను దన్నుగా నిలిచినా రెడ్డి బ్రదర్స్ అని పిలవబడే ఇద్దరు కీలక నాయకులు

తెలుగుదేశం కండువా కప్పుకోవటం జగన్ కి పెద్ద షాక్ గానే చెప్పవచ్చు …వీరి చేరికకు ముఖ్య కారణం కూడా జగన్ వైఖరి అనే తెలుస్తుంది

బలపనూరుకి చెందిన నారాయణరెడ్డి , శ్రీ నాధరెడ్డిలు వారి ప్రాంతంలో కార్యక్రమాలు అన్నీ తామయి ముందుండి నడిపించేవారు …నిరంతరం క్షేత్రస్థాయి కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉండే రెడ్డి బ్రదర్స్ చేరిక తెలుగుదేశం పార్టీకి అదనపు బలమే …అంతే గాక రానున్న సంవత్సరకాలంలో

పులివెందుల నుంచి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి అని సంకేతాలు అందుతున్నాయి ….మరి చూద్దాం జగన్ తన కోటని ఎలా నిలబెట్టుకుంటారు …వారి కుటుంబం హవా పులివెందులలో ఇంకెన్నాళ్ళు కొనసాగించగలరు అనేది