Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలవరం పై జగన్ ప్రభుత్వం తీరు బాధాకరం..!

Category : politics state

ఎప్పుడైతే రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపేయాలని నవయుగ సంస్థకు నోటీసులు పంపిందో మర్నాడే కేంద్ర సర్కారు ఈ విషయం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని వెల్లడించింది. అంతే కాకుండా ఈ కారణం వల్ల పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా చెప్పలేమని విచారం వ్యక్తం చేసింది. జాతీయ ప్రాజెక్టే అయిన పోలవరం నిర్మాణ పనులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ ఉన్నప్పుడు వేగంగా సాగిన నిర్మాణ పనులు, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నెమ్మది అయ్యాయి. ప్రభుత్వం అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని ప్రకటించింది. ఆ దిశగానే నవయుగకు 60 సీ నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పుడు పనులు ఆపేయాలని ఆ సంస్థను ఆదేశించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ శుక్రవారం జలాశయాల భద్రతపై లోక్‌సభలో చర్చ జరిగిన సమయంలో పోలవరం అంశాన్ని కూడా ప్రస్తావించారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ దీనికి బదులిచ్చారు. టెండర్లు రద్దు చేయడం వల్ల ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనుల్లో ఉన్న సంస్థ కాంట్రాక్టును రద్దు చేసిందని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టుకు మరో అడ్డుగా మారుతుంది. దీనివల్ల ప్రాజెక్టు పూర్తికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. అలాగే ఖర్చు భారీగా పెరుగుతుంది అని షెకావత్‌ చెప్పుకొచ్చారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న జయదేవ్‌, చంద్రబాబు నేతృత్వంలో 2019 నాటికి భూసేకరణ పూర్తయ్యింది. అంతేకాకుండా డయాఫ్రం కూడా పూర్తి చేశారు. మట్టి తవ్వకాలతో గిన్నిస్ బుక్‌లో కూడా ఎక్కాం. ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కావొచ్చింది అని పేరుకొన్నారు.