//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రత్యేక హోదా మీద జగన్ సంచలన నిర్ణయం..!

Category : politics

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరడంతో అప్పటి యూపిఏ ప్రభుత్వం విభజనకు ఆమోదం పలికింది.ఈ నేపథ్యంలో 2014లో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాయి.ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బోలెడన్ని హామీలు ఇచ్చింది.పునర్విభజన బిల్లులో బోలెడన్ని అంశాలను పేర్కొంది.అయితే విభజన జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ పునర్విభజన బిల్లులోని అంశాలకు తగిన స్థాయిలో నిధుల కేటాయింపు జరపలేదు కేంద్ర ప్రభుత్వం.

యూనియన్ బడ్జెట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ముఖ్యమైనదే.దేశ ప్రజలంతా దీన్ని ఆసక్తితో గమనిస్తూ ఉంటారు.విభజన తర్వాత ఇప్పటి వరకూ నాలుగు పర్యాయాలు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టినా తగిన న్యాయం మాత్రం జరగలేదు.ఈ నేపథ్యంలో ఐదో సారి బడ్జెట్ లో అయినా ఏపీకి న్యాయం జరుగుతుందా, విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం నిధులు విడుదల చేస్తారా అన్న అంశంపై ఏపీ ప్రజలు, నాయకులు ఎంతగానో ఎదురు చూశారు.

తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలను కేంద్రం విస్మరించింది.బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు.అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అరుణ్ జైట్లీ ప్రస్థావించలేదు.రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అస్సలు పట్టించుకోలేదు.దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం తీరుపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు.రాజీనామా చేసే యోచనలో ఆ పార్టీ ఎంపీలు ఉన్నారు.బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ , ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related News