ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దాటి రాజకీయం చెయ్యాలి అంటే దాదాపుగా అసాధ్యం... బడ్జెట్ నుంచి చంద్రబాబు చేసిన రాజకీయం ముందు కేంద్రం నుంచి రాష్ట్రంలోని విపక్ష౦ వరకు అందరు తేలిపోయారు అనేది వాస్తవం. మంత్రులను ఉపసంహరించుకున్న తర్వాత చంద్రబాబు వేసిన ప్రతి అడుగు కూడా ఆయనలో ఒక రాజకీయ నాయకుడిని బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రం వద్ద లాలూచి పడ్డారు అనే వారు దాదాపుగా నోరు మూసే పరిస్థితి వచ్చింది.
ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చి చూద్దాం... జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్వరం మార్చి అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. మన బంగారం మంచిది అయితే అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి పెరిగిపోయింది అంటూ ఇసుక నుంచి ఎక్కడి ఎక్కడికో మాట్లాడుకుంటూ వెళ్ళారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు శాశన మండలిలో ఇచ్చిన వివరణ తర్వాత పవన్ ఆత్మరక్షణలో పడిపోయారనుకోండి అది వేరే విషయం.
అయితే ఇప్పుడు పవన్ సొంతగా పోటి చేస్తేనో లేక తాను సావాసం చేస్తున్న వామపక్షాలతో కలిసి పోటి చేస్తేనో జగన్ కి ఊహించిని షాక్ తగలడం ఖాయం. పవన్ అనే వ్యక్తికి ఎంతో కొంత అభిమానుల బలం ఉంది. పవన్ కి కొన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అలా పవన్ పోటి చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే జగన్ పవన్ వ్యతిరేక ఓటు ని పంచుకుంటారు. ఫలితంగా జగన్ నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇది అంతా జరగాలి అంటే పవన్ కళ్యాణ్ తో కలిసి పోటి చెయ్యాలి. మరి దానికి పవన్ ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి.