//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సొంతూరిని ప‌ట్టించుకోని వాడు సింగపూర్ కడతాడా ?

Category : politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మీదుగా సాగుతోంది.

ఇక్కడ ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే... చంద్రబాబు పోటీ చేసింది కుప్పం నుండి అయినా ఆయన సొంత నియోజకవర్గం మాత్రం చంద్రగిరి. ఆయన సొంతూరు నారావారి పల్లె మాత్రం చంద్రగిరి నియోజవర్గంలోనే ఉంటుంది. ప్ర‌స్తుతం నారావారి పల్లె పక్కనే ఉన్న శేషాపురం మీదుగా జగన్ పాదయాత్ర సాగుతోంది.

జ‌గ‌న్ అక్క‌డ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ స‌మ‌యంలో బాబు పై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. శేషాపురంలోని స్కూల్లోనే చంద్రబాబు చదివారట. అయితే ఇప్పుడు ఆ స్కూలు శిథిలావస్థలో ఉంది.. అలాంటి బడికే పిల్లలు ఇప్పటికీ వెళ్తున్నారు. ఇలా సొంతూరినే పట్టించుకోని చంద్రబాబు నాయుడు సింగపూర్ కడతారట..’ అని జగన్ ఎద్దేవా చేశారు.

అయితే నేటితో జగన్ పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ జగన్ సుమారు 770 కిలోమీటర్ల దూరం నడిచారు. నేడు జగన్ పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గం మీదుగా సాగుతోంది. చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్‌కు అనూహ్య‌రీతిలో స్పంద‌న వ‌స్తోంది.