//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రత్యేక హోదా ఉద్యమంలో జగన్ తెలిపోయాడా..?

Category : politics

ప్రత్యేక హోదా ఉద్యమంలో జగన్ తేలిపోయాడా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా జగన్ రాజకీయం ఎప్పుడు అనేక ప్రశ్నలతోనే ఉంటుంది. ఆ ప్రశ్నలు సహజం అయినా..అవి కాస్తా జగన్ నిజాయితీని ప్రశ్నించే విధంగా ఉంటాయి. ప్రత్యేక హోదా ఉద్యమంలో జగన్ ముందు నుంచి ఉన్నారు. కాని ఈ నాలుగేళ్ళలో ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు కదా అసలు బిజెపి నేతలను కూడా ఎక్కడా విమర్శించలేదు.

దీనిపై అనేక ప్రశ్నలు..దానికి తోడు ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి తరుచుగా వెళ్లి ప్రధానిని కలవడం.. చంద్రబాబుని కలవడానికి ఆశక్తి చూపని ప్రధాని వారిని మాత్రం నిత్యం కలుస్తూనే ఉన్నారు. దీనితో జగన్ రాజకీయంపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆయన కేసులతో లాలూచి పడినట్టు ప్రతి చోట వినపడుతుంది. కాని ఆయన మాత్రం చంద్రబాబుని మాత్రం విమర్శించడం కేంద్రాన్ని విమర్శించకపోవడం పలు ప్రశ్నలకు..కాక పలు అనుమానాలకు ఊతం ఇస్తుంది.

కాని చంద్రబాబు రాజకీయం ముందు జగన్ తేలిపోయాడు. కేంద్రంపై చంద్రబాబు విమర్శల దాడిని పెంచారు.. ప్రధాని మోడీ లక్ష్యంగా జాతీయ పార్టీల నేతలను కలిసారు. ప్రధాని మోడిని ఢిల్లీ వెళ్లి విమర్శించారు. ఎంపీలు పార్లమెంట్ ముందు కాక ప్రధాని ఇంటి ముందు ధర్నా కూడా చేసారు. దీనితో జగన్ ఒక్కసారిగా తేలిపోయాడు. కేంద్రం వద్ద చంద్రబాబు లాలూచి పడ్డారనే ఆయన చేసే విమర్శకు కాలం చెల్లిపోయింది. చంద్రబాబు నోటితో సమాధానం చెప్తూనే చేతలతో కూడా సమాధానం చెప్పారు. దీనితో చివరిగా జగన్ కేంద్రం వద్ద లాలూచి పడ్డారు..చంద్రబాబు కాదు అనే స్పష్టత ప్రజలకు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related News