//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రవీంద్ర జడేజా సోదరికి నోటీసులు ...

Category : national

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా గత ఏడాది డిసెంబరులో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జడేజా తన సోదరితో కలిసి నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంట్‌లో నాణ్యత లేదంటూ వార్తల్లో నిలిచింది. రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు శుక్రవారం జడేజా రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌లో ఎక్కువ కాలంపాటు నిల్వ వుంచిన ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులను కనుగొన్నారు. వీటిపై ఫంగస్ ఏర్పడటాన్ని కూడా గుర్తించారు. పరిమితికి మించి ఫుడ్‌ కలర్స్‌, అజినోమోటో వినియోగిస్తున్నట్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీఆర్‌ రాథోడ్‌ వెల్లడించారు. ఈ రెస్టారెంట్లో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులపై గడువు తేదీ కూడా లేకపోవడం.. పాడైపోయిన కూరగాయలను గుర్తించిన సిబ్బంది వాటిని సీజ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పక్కనపెట్టి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న జడేజా సోదరికి అధికారులు నోటీసులు అందజేశారు