//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెచ్చ‌గొట్టే మాట‌ల న‌డుమ‌.. కౌగిలింత‌లు..!

Category : movies

జ‌బ‌ర్దస్త్‌లో ఇప్పుడు పిచ్చి పీక్స్ వెళ్లింద‌నే చెప్పాలి. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం కావొచ్చు, తాము కూడా గుర్తింప‌బ‌డాలి అన్న కోరిక కావొచ్చు హైప‌ర్ ఆది చేసే ప్ర‌య‌త్నాలు మ‌రీ నీచ‌త్వాన్ని త‌ల‌పిస్తున్నాయి. పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్టు.. సుడిగాలి సుధీర్‌ను చూసిన హైప‌ర్ ఆది కూడా అదే చేస్తున్నాడు. సుధీర్ - ర‌ష్మీల కెమిస్ట్రీనే తాను కూడా కంటిన్యూ చేయాల‌ని డిసైడ్ అయిపోయాడు.

అందులో భాగంగానే హాట్ న‌టి క‌మ్ యాంక‌ర్ అన‌సూయ మీద నే క‌న్నేశాడు. ఇంతకు ముందు జ‌రిగిన షోల‌లో అన‌సూయ‌ మేడం ఐ ల‌వ్యూ అన్న మాట‌తో స‌రిపెట్టుకున్న హైప‌ర్ ఆది.. ఈ సారి ఒక అడుగు ముందుకేసి ఏకంగా హ‌గ్ చేసేసుకున్నాడు. అన‌సూయ‌ను హ‌గ్ చేసుకునే ముందు ఓ పెద్ద ప్ర‌ణాళిక‌నే అమ‌లు ప‌రిచాడు హైప‌ర్ ఆది. జ‌బ‌ర్ద‌స్త్‌లో పంచ్‌లు ప్రాస‌ల్లో ఆరితేరిన వ్య‌క్తి హైప‌ర్ ఆది అన్న విష‌యం ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసిందే. ఇప్పుడు ఆ పంచ్‌లు, ప్రాస‌ల‌నే హైప‌ర్ ఆది ఉప‌యోగించుకుంటున్నాడు. ఆఖ‌రికి అన‌సూయ‌ను కూడా. అయితే, ఢీ 10 ప్రోగ్రామ్‌లో పాటిస్పెట్స్ బాగా చేస్తే.. వెంట‌నే ప్రియ‌మ‌ణి హ‌గ్ ఇస్తుంద‌ని, అటువంటి జ‌బ‌ర్ద‌స్త్‌లో హగ్‌లు ఇచ్చే వారే లేరా..? అన్న హైప‌ర్ ఆది ప్ర‌శ్న‌కు.. అనసూయ వెంట‌నే లేచి హైప‌ర్ ఆదికి హ‌గ్ ఇచ్చింది. ఇలా రెచ్చ‌గొట్టే మాట‌ల‌తో అన‌సూయ‌ను బుట్ట‌లో వేసుకోవ‌డం హైప‌ర్ ఆది వంతైంది.