//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్స్ రాసే అంత లేదు నాకు ...' జబర్దస్త్ ఆది'

Category : movies

జబర్దస్త్ టివి షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది. అయితే ఈ షో తరువాత బాగా ఫెమస్ అయినా వారిలో వేణు,ధన్ రాజ్,చమ్మక్ చంద్ర,వీరి తరువాత వీళ్ళకంటే ఎక్కువ నేమ్,ఫెమ్ తెచ్చుకున్న నటుడు ఆది.ఆదికి మాత్రం అంతకు మించిన గుర్తింపు దక్కించుకున్నాడు. ఆది జబర్దస్త్ షో తెచ్చిన గుర్తింపు తో అటు వెండి తెరపై కూడా తనదైన శైలిలో కామెడీతో అలరిస్తున్నాడు.

ఆది నటించిన ఎక్కువ సినిమాలలో తన పాత్రకు తానే డైలాగ్స్ రాసుకుంటాడని కూడా టాక్ ఉంది.అయితే కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ ను ఆది కలిశాడు. దాంతో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంకు డైలాగ్స్ రాసేందుకు ఆదికి ఛాన్స్ ఇచ్చినట్లుగా వార్తలు రావడం జరిగింది.

తాజాగా ఆ విషయమై ఆది స్పందిస్తూ అవి పుకార్లే అంటూ కొట్టి పారేశాడు. త్రివిక్రమ్ గారిపై తనకు చాలా అభిమానం ఉంది. ఆ అభిమానంతో ఆయన్ను నాలుగు సార్లు కలవడం జరిగింది. అభిమానంతోనే కలిశాను తప్ప మరేం కారణం లేదని. ఆయన సినిమాలకు మాటలు రాసేంతటి వ్యక్తిని నేను కాదు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ గారు తీసే ప్రతి సినిమాకు ఆయనే కథ - మాటలు రాసుకుంటారు. ఆయనకు మరెవ్వరి అవసరం లేదని ఆది అన్నారు.

నాతో మాటలు రాయించుకోవాల్సిన అవసరం ఆయనకు అంతకన్నా లేదని. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయని అయితే ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. రానున్న రోజుల్లో అవసరం ఉంటె తప్ప నా పాత్రకు నేను మాటలు రాసుకోనని..అవకాశం వస్తే రైటర్ గా కూడా నిరూపించు కుంటాను అని ఆది చెప్పుకొచ్చాడు.

Related News