//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రంప్ ప్రెసిడెంట్ కాక ముందు ఇవాంక ఏమి చేసేదో తెలుసా ?

Category : world

వైట్ హౌస్ కొలువులో చేరడంతో ఇవాంక బిజినెస్ కు ఫుల్ స్టాప్ పడింది. ఇవాంక వైట్ హౌస్ లోకి రాకముందు ఏం చేసింది… ఏం చదువుకుంది… ఏ బిజినెస్ లో రాణించింది.

ఇవాంక పర్సనల్ లైఫ్ పై ప్రత్యేక కథనం…డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య, మోడల్ అయిన ఇవానా రెండో కూతురే ఇవాంక మరియా ట్రంప్. ట్రంప్, ఇవానా 1991లోనే విడాకులు తీసుకున్నారు. అప్పటికి ఇవాంక వయసు పదేళ్ళు. ఆమెకు 15యేళ్ళ వచ్చేవరకూ మన్ హట్టన్ లోనే చదువుకుంది. ఆ తర్వాత కనెక్టికట్ లోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. చోయేట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇవాంక… 2004లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎకనమిక్స్ లో లో డిగ్రీ పూర్తి చేసుకుంది.

కనెక్టికట్ లో స్కూల్ ఏజ్ లో ఉండగానే… 14యేళ్ళ వయస్సులో ఇవాంక మోడలింగ్ లో జాయిన్ అయింది. ఏడాదిలోనే ప్రముఖ మేగజైన్స్ లో ఆమె ఫోటోలు పబ్లిష్ అయ్యాయి. క్యాట్ వాక్ షోస్ లో పాపులర్ అయింది. అప్పట్లోనే ప్రకటనల్లో కూడా నటించింది. డిగ్రీ పూర్తయిన వెంటనే 2005లో ఇవాంక ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయింది. మొదట డైమండ్ బిజినెస్ లో ఆ తర్వాత గోల్డ్ జ్యూయలరీలో లో బిజినెస్ చేసింది.

బట్టలతో పాటు యాక్సెసరీస్ ను రూపొందించింది. తన పేరుతోనే షూస్, జ్యూయలరీతో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ను మార్కెట్లోకి తెచ్చింది ఇవాంక. 2015 లోనే వంద మిలియన్ డాలర్లను బిజినెస్ లో సంపాదించిందంటే … ఆమె కలెక్షన్స్ కు అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. చైనాలో కూడా ఇవాంక కలెక్షన్స్ కు కాసుల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆమె బిజినెస్ చైనాలో విజయవంతంగా నడుస్తోంది.

ఒక్క ఫ్యాషన్ రంగంలోనే కాదు… తండ్రి డొనాల్డ్ ట్రంప్ కు చెందిన అనేక వ్యాపారాలను ఆమె నిర్వహించారు. లిక్కర్ బిజినెస్ తో పాటు గోల్ఫ్స్ క్లబ్స్, రిసార్ట్స్, హోటల్స్ లాంటి అనేక వ్యాపారాలు నడిపించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆయన వ్యాపారాల నుంచి తప్పుకున్నారు. కొన్నాళ్ళు ఇవాంకే ఈ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత వైట్ హౌస్ లో అడ్వైజర్ గా జాయిన్ అవడంతో తను కూడా బిజినెస్ కు గుడ్ బై చెప్పింది.

ఇవాంక 2009లో యూదు మతానికి చెందిన జారెద్ కుష్నర్ ను పెళ్ళి చేసుకుంది. తర్వాత యూదు మతంలోకి మారింది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు… వీళ్ళల్లో అరబెల్లా పెద్దది. ఐదేళ్ళ వయస్సులోనే తల్లిలాగే ఎన్నో అద్భుతాలు చేస్తోంది అరబెల్లా… చైనా అధికార భాష మాండరిన్ లో… వాళ్ళ సంప్రదాయ గీతాన్ని పాడిన అరబెల్లా చైనా అధ్యక్షుడితో పాటు కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది.

Related News