ప్రధాని నరేంద్ర మోదీ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చిన విందుకు ఇవాంకా ట్రంప్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, దౌత్యవేత్తలు, దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, టాటా గ్రూప్ సీఈవో చంద్రశేఖర్, మిట్టల్ తదితరులకు తోడు సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.
ఈ విందును నిజాముల ప్రతిష్ఠాత్మక 101 టేబుల్ పై ఏర్పాటు చేశారు. ఈ విందులో అతిధుల కోసం వివిధ రకాలు పదార్థాలు తయారు చేసినట్టు షెఫ్ లు తెలిపారు.
ఇటాలియన్, మొఘలాయ్ వంటకాలతో పాటు పది రకాల హైదరాబాదీ బిర్యానీలు.
ముర్గ్ పీస్తా కా సలాడ్,
సీతాఫల్ కుల్ఫీ,
అఘజ్ సూప్,
వాక్ఫా అనే షర్బత్,
ఘోస్ట్ షికాంపురీ కీబాబ్,
దహీ కే కీబాబ్,
కుబానీ కే మలాయ్ కోఫ్తా,
మెజ్ బన్,
వాక్ఫా,
మహ్ గూల్ దస్తర్ క్వాన్,
గులాబ్ జామ్ తదితర ఎన్నో వెరైటీలు అతిథుల కోసం సిద్ధం చేశారు.
ఈ విందులో ముఖ్యంగా గంధం, కుంకుమ వేళవించిన వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీటన్నింటితో పాటు భారతీయ, హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మరిన్ని వంటకాలు ఉంటాయి. ఒక్కో అతిథికి ఒక్కో వ్యక్తి ఈ వంటకాలన్నింటినీ వడ్డించనున్నారు.